పులివెందుల మున్సిపాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, అధికార బలంతో అడ్డదారిలో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర కుట్రలు పన్నుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎంఓ, డీజీపీ కార్యాలయాల నుంచి వస్తున్న ప్రత్యక్ష ఆదేశాలతో స్థానిక పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది గూండాలను పులివెందులకు రప్పించి, వారికి పోలీసులే లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో వసతి కల్పిస్తున్నారని చెప్పారు.