కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ లక్ష్యాల దిశగానే తెలంగాణ సాగుతోందని దిల్లీలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రెండు కొత్త విమానాశ్రయాలను కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

