ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పునరావాస శిబిరాల్లో ఉంటున్న ఒక్కో బాధితుడికి రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. నగదు సాయంతో పాటు బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.