బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని అన్నారు. గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు.