తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలతో ‘సైక్లోన్ ఆర్నబ్’ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని అమిత్ షా తెలిపారు నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నట్లు చెప్పారు.