అతి తీవ్ర తుపాను అర్నాబ్.. తుపానుగా బలహీనపడిందని, ఈ రోజు రాత్రికి క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు.. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

