అర్నబ్ తుపాను తీరం దాటినా కాకినాడ జిల్లాలో దాని ప్రభావం కొనసాగుతోంది. తుపాను తీరం దాటిన సమయంలో అలల ఉద్ధృతికి ఉప్పాడ తీరం (Uppada coastal area) కోతకు గురైంది. కొత్తపట్నం వద్ద అలల ధాటికి భారీ బండరాళ్లు ఎగసిపడి బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.