తమిళనాడులోని తేని జిల్లాలో సోమవారం అర్ధరాత్రి సమయంలో సబ్ జైల్ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో పోలీసులు తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీల్లో ఒకరిని తిరిగి అరెస్ట్ చేశారు. ఒక సెల్లో ఉన్న కొందరు ఖైదీలు పరారయ్యేందుకు తొలుత ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆ గదిలోకి ప్రవేశించగానే.. దాడి చేసి పరారయ్యారు. జైలు వెనుక అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు భావిస్తున్నారు.