SIR విషయంలో అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. ‘సర్ ‘ లో భాగంగా ఓటరు నమోదు కోసం ఉపయోగించే ‘ఫారం 6’ లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ అఫిడవిట్ ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను విధుల నుంచి తప్పించాలన్న అభ్యర్థనలు,ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.