స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, పార్టీ నేతల పనితీరుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిణామాలపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. విభేదాలున్న చోట్ల స్థానిక ఎమ్మెల్యే, జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. సమస్యలు పరిష్కరించుకొని కలిసి పని చేయాల్సిందేనని స్పష్టంగా చెబుతున్నారు. పాజిటివ్ వాతావరణాన్ని చెడగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే.. సస్పెండ్ చేసేందుకూ వెనుకాడబోమని చంద్రబాబు హెచ్చరించారు.