లెబనాన్ లోని సైడాన్ నుండి బేరూత్ కు కలపతో వెళ్తున్న ఒక కార్గో నౌక సముద్రంలో ప్రమాదానికి గురైంది. నౌకలోకి నీరు చేరడంతో అది నియంత్రణ కోల్పోయి కొట్టుకుపోయింది. ప్రమాద తీవ్రత పెరగడంతో నౌకలోని 7 మంది సముద్రంలోకి దూకగా, వెంటనే చేరుకున్న లెబనాన్ సివిల్ డిఫెన్స్ రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి.