బంగారంతో తయారు చేసిన నడకమార్గాన్ని ఎక్కడైనా చూశారా..? దానిపై ఎప్పుడైనా నడిచారా..? మీకు ఈ వింత అనుభూతిని ఇవ్వడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోని మొట్టమొదటి ‘గోల్డ్ వాక్‌వే’ను త్వరలోని అందుబాటులోకి తేనుంది. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో నిర్మించటం మరో విశేషం. త్వరలో గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో బంగారు ఆభరణాల భారీ ఎగ్జిబిషన్ కూడా పెట్టడానికి సన్నహాలు చేస్తున్నామని రషీద్ అల్ హర్మౌదీ తెలిపారు.