తమ వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు నటులు విజయ్ దేవరకొండ, రష్మిక గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలని రష్మిక తనను వంద సార్లు అడిగిందని చెప్పారు. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించటం మొదలుపెట్టారు. విమర్శల తాకిడి ఎక్కువయ్యే సరికి రష్మిక, విజయ్ వీటిపై స్పందించారు. పెళ్లి ప్రాతిపాదన తెచ్చినప్పుడు విజయ్ సమయం తీసుకోవడంలో తప్పు లేదని రష్మిక పోస్ట్ చేశారు.