రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ముందు 10 నుంచి 12 మంది రాజకీయ నాయకులను చంపాలంటూ వంచిత్ బహుజన్ ఆఘాడీ (వీబీఏ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన తర్వాత రాజకీయ నాయకులు వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లడంపై ప్రకాశ్ అంబేడ్కర్ అసహనం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు ముందుగానే పరిష్కరించకుండా, విషాద ఘటనలు జరిగిన తర్వాత పరామర్శల పేరుతో వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.