నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్ బోస్ ‘ఫౌజీ’ సినిమా గ్లింప్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్ర యూనిట్ స్వాతంత్ర్య సమరయోధుల ప్రాముఖ్యతను, చరిత్రను దారుణంగా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, అడోల్ఫ్ హిట్లర్‌తో నేతాజీ జరిపిన చారిత్రక సమావేశాన్ని సినిమాలో చూపించిన విధానంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన వీరుల చరిత్రను వినోదం పేరుతో మార్చడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. దీనివల్ల రాబోయే తరాలకు తప్పుడు సమాచారం అందుతుందని బోస్ ఆందోళన వ్యక్తం చేశారు