ఒడిశా రాజధాని భువనేశ్వర్లో RBI అత్యాధునిక హంగులతో నిర్మించిన సరికొత్త డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధారణ పేద, మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న బ్యాంక్ ఖాతా తెరవాలన్నా గ్యారంటర్లను వెతుక్కోవాల్సి వచ్చేదని ప్రధాని గుర్తుచేశారు. అదే సమయంలో రాజకీయ పలుకుబడి ఉన్న కుబేరులకు మాత్రం కేవలం ఫోన్ కాల్స్ ద్వారా దిల్లీ పెద్దల సిఫార్సులతో వేల కోట్ల రూపాయల రుణాలు దక్కేవని ఆరోపించారు