ఆదోని పట్టణంలో కూటమి పార్టీల పొత్తు ధర్మాన్ని గుర్తించి రెబెల్స్‌గా ఉన్నవారు తప్పుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. ఆదివారం 41వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో 52 వార్డులకు గాను 19 వార్డులు భాజపాకు కేటాయించారన్నారు. భాజపాకు కేటాయించిన స్థానాల్లో 13 స్థానాల్లో రెబల్స్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు దృష్టికి తీసుకెళ్తే.. పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారని ఆయన పేర్కొన్నారు.