తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సింగిల్ విండో ఆమోద పోర్టల్ ‘టీజీ-ఐపాస్’ రాన్సమ్వేర్ సైబర్ దాడికి గురైంది. దీనితో వ్యవస్థ స్తంభించిపోగా, నివేదికలు డాటాబేస్ ఎన్‌క్రిప్ట్ (లాక్) అయినట్లు చూపిస్తున్నాయి. పోర్టల్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు… దాని డేటాబేస్‌ను కూడా ఎన్‌క్రిప్ట్ చేశారు. అక్టోబరు 22న రాత్రి 11.36 గంటలకు సైబర్ దాడి జరగడంతో పోర్టల్ అప్లికేషన్ నిలిచిపోయింది. హ్యాకర్లు నేరుగా డబ్బులు ఏవీ డిమాండ్ చేయలేదు, కేవలం సంప్రదించడానికి ఒక ఈ-మెయిల్ ఐడీ మాత్రమే ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు.