ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట శాంతి బాండ్‌పై సంతకం చేయబోనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా శనివారం తెలిపారు. రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు ఒక పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసిన మరుసటి రోజే నేహా బోరా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వంపై ఆందోళనలు వ్యక్తం చేయడాన్ని శాంతికి ముప్పుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు.