నెలల తరబడి శ్రమించి పండించిన పంటకు నీరు అందకపోవడంతో చివరకు ఆ పంటనే అగ్నికి ఆహుతి చేయాల్సిన దుస్థితి ఎదురైంది. రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన రైతు ఉప్పరి వెంకటేశు 20 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు సమాచారం. పంట కోసం భారీగా పెట్టుబడులు పెట్టినా, సాగునీరు అందక పంట ఎండిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నీటి కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తన పంటకు నిప్పంటించిన ఘటన కలచివేస్తోంది.