ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం చైనాలో పర్యటించారు. ఇటీవలే ప్రారంభమైన కొత్త సరిహద్దు వంతెన మీదుగా చైనాలోని డాండోంగ్ నగరానికి చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభమైన కొద్ది రోజులకే కిమ్ దానిపై ప్రయాణించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్ హునింగ్‌తో కలిసి కిమ్ ఒక కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. అనంతరం కొరియా యుద్ధ స్మారకాన్ని సందర్శించి, ఆ యుద్ధంలో మరణించిన చైనా సైనికులకు నివాళులర్పించారు.