బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తనపై దాడి జరిగిన కొద్ది రోజులకే ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అమ్మేశారు. ఈ ఫ్లాట్‌ను రూ.9 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. రుస్తోంజీ పారామౌంట్ డీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 9వ అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీని కార్పెట్ విస్తీర్ణం 1,291.14 చదరపు అడుగులు కాగా, అదనంగా 95.80 చదరపు అడుగుల ప్రత్యేక విస్తీర్ణం ఉంది. టైగర్ ష్రాఫ్ ఈ ఆస్తిని జూలై 2018లో రూ.7.61 కోట్లకు కొనుగోలు చేశారు.