తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం ప్రకారం.. చెన్నై విమానాశ్రయంలో విమాన ఇంధనంపై వ్యాట్‌ను 29 శాతం నుంచి 16 శాతానికి తగ్గించనున్నారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో ఈ పన్నును 29 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించనున్నారు. ఈ మార్పులు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 అక్టోబర్ 31 వరకు ఈ రాయితీలు కొనసాగనున్నాయి. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులను తగ్గించడం, రాష్ట్రంలోని నగరాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.