ఆసియా పారా గేమ్స్ లో భారత బ్యాడ్మింటన్ చివరి రోజు మూడు స్వర్ణ పతకాలతో భారత్ సత్తా చాటింది. దీంతో ఈ పోటీల్లో మొత్తం 16 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో నితేశ్ కుమార్ ప్రమోద్ భగత్‌ను ఓడించాడు. 21-18, 21-16 తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో థులసిమతి మురుగేశన్, మానసి జోషి జోడీ స్వర్ణం సాధించింది.