ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింస చోటుచేసుకుంటున్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా మార్పులేదని, రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జెడ్పీటిసి, ఎంపిటిసి నామినేషన్ల సమయంలోనూ హింసకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.