వందేళ్ల క్రితం బ్రిటీష్ వాళ్లు చేసిన కుల గణన మేం చేశామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వందేళ్లలో ఎవరూ చేయని లెక్క తాము తేల్చామని అన్నారు. రవీంద్రభారతి లో పండగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు జరిగాయి. సాయన్న జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎం హాజరయ్యారు. పండుగ సాయన్న జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేశారు. తన భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేసిన వ్యక్తి పండుగ సాయన్న అని భూస్వాములు, జమీందార్లపై పోరాటం చేసిన వ్యక్తి.. పండగ సాయన్న అని ప్రశంసించారు.