ఆసియా పారా క్రీడల్లో భారత ఆర్చర్లు శీతల్ దేవి, తోమన్ కుమార్లు అదరగొట్టారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీ ఫైనల్లో ఇండోనేషియాపై ఘన విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 16వ స్వర్ణం చేరింది. అంతకు ముందు ర్యాంకింగ్ రౌండ్లో ఈ జోడీ 1,402 పాయింట్ల సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరోవైపు మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ భారత్కు మరో స్వర్ణం అందించింది. మహిళల ఆర్చరీలో స్వాతి చౌదరి రజత పతకం సాధించింది.