రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు, NOCలు ఇవ్వకుండా అడ్డుపడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీకి ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా చేసింది. పోలీసుల నుండి NOC, ప్రభుత్వ శాఖల నో డ్యూ సర్టిఫికెట్లు లేకపోయినా నామినేషన్ తిరస్కరించడానికి వీల్లేదని అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ పత్రాలతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించలేదనే కారణంతో నామినేషన్ను తిరస్కరించకూడదని అధికారులకు స్పష్టం చేసింది.