కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జంబూ సవారీలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరీ అమ్మవారి ఉత్సవమూర్తిని సీఎం దర్శించుకున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సహా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి రేవంత్ రెడ్డి ఆ ఉత్సవాలను వీక్షించారు.