ఏపీ స్థానిక ఎన్నికల్లో 19 పురపాలికలు మినహాయించి మిగతా పురపాలికలు, కార్పొరేషన్లలో ఎన్నికలు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా పర్యవేక్షించాలన్నారు.