శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన భర్తతో పాటు తాము ఉత్తరాంధ్రలో టీడీపీని బలోపేతం చేయడానికి సుమారు 40 సంవత్సరాలకుపైగా కష్టపడితే తగిన ప్రతిఫలం దక్కలేదని అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే సతీమణి గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి 4 ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రి పదవి చేపట్టిన నేత కుటుంబం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరుతుండటంతో ఏపీలో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.