జియో ప్లాట్ ఫామ్స్ మెగా ఐపీఓకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. రూ.30,213 కోట్ల మెగా పబ్లిక్ ఇష్యూ తొలిరోజు ఉదయం 10:36 గంటలకే ఇష్యూ పూర్తి సబ్ స్క్రిప్షన్ (1.01 రెట్లు) అందుకుంది. మెగా ఐపీఓల్లో అత్యంత వేగంగా సబ్ స్క్రైబ్ అయిన ఇష్యూగా రికార్డు సృష్టించింది. ఆఫర్ చేసిన 19.75 కోట్ల షేర్లకు గాను ఉదయం 10:36 సమయానికి 20.03 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా క్యూఐబీ కోటా 3.25 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.

