ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను హోల్డ్ చేసింది. దీంతో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. నామినేషన్ల గడువు పొడిగిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ను సవరించేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోనుంది.