తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ వేళ మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు ప్రధాన పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.755 కోట్ల 14 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అక్టోబర్ లో సుమారు రూ.2,054 కోట్లకు పైగా మద్యం వ్యాపారం జరిగిందని అక్టోబర్ 19 న ఆ ఒక్క రోజులోనే ఏకంగా రూ. 303 కోట్ల 40 లక్షల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి.