ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. నవంబర్ 1వ తేదీన లాంచనంగా ప్రారంభం కానుంది.ఈ రైలు బెంగళూరులో బయల్దేరనుండగా.. ఏపీ మీదుగా ముంబైకు వెళ్లనుంది. ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగనుంది. ముంబైలో ప్రతీ రోజు రాత్రి 10:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. బెంగళూరు నుండి రాత్రి 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది.

