స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. రాష్ట్రంలో కూటమి, పొత్తు ధర్మం ఉంటుందా.. ఊడుతుందా.. అన్నది తెలియడానికి చివరి మూడు గంటల సమయం మాత్రమే ఉందంటూ బొలిశెట్టి సత్యనారాయణ ఇవాళ ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల్లోగా 30% ప్రతి నియోజకవర్గంలో జనసేనకు కేటాయించి జనసేన గురించి ప్రాణాలర్పించే జన సైనికులకు వీర మహిళలకు చోటు కల్పిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది లేదంటే తెలుగుదేశం ఓటమి తథ్యం అంటూ బొలిశెట్టి తేల్చిచెప్పేశారు.

