సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ సమావేశమైంది. 19 స్థానాల్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా, సెక్రటరీ మల్లికార్జున, ఐజీ రాజకుమారి భేటీ అయ్యారు. ఆయా స్థానాల్లో జరిగిన ఘటనలు, కేసుల అంశంపై ఎస్ఈసీ చర్చ జరుపుతోంది. రెండు రోజుల పాటు నామినేషన్ల గడువు పొడిగించిన సుప్రీంకోర్టు.. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీస్ భద్రత కల్పించాలని ఆదేశించింది.