ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైకాపా-తెదేపా వర్గీయులు రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ఇరువర్గాలు గొడవకు దిగాయి. వైకాపా, తెదేపా నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి భారతిపైతో పాటు ఆమె భర్త లక్ష్మారెడ్డిపై దాడి జరిగింది. లక్ష్మారెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.