వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘పోలీస్ కంపెనీ’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు ‘D కంపెనీ కంటే మరింత ప్రమాదకరం’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 2027 జూన్ 4న విడుదల చేయనున్నట్లు వర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు పోలీసుల కార్యకలాపాలు,గ్యాంగ్స్టర్లపై జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు