2029 డిసెంబర్ 31 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దిల్లీలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మాట్లాడుతూ రానున్న మూడేళ్ల పాటు ఉమ్మడిగా పోరాడి మాదకద్రవ్యాల మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల భవిష్యత్ తరాలు నాశనం కావడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని మాదక ద్రవ్యాల వల్ల జాతి వ్యతిరేక శక్తులకు ఆర్థిక సాయం అందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.