సమాజంలో శాంతిభద్రతలు పోలీసులతోనే సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు ఉందని తెలిపారు. తీవ్రవాదం, రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేయడంలో పోలీసులు ప్రముఖపాత్ర వహిస్తున్నారన్నారు. ఎప్పుడు చూసినా విధుల్లో ఉండి ప్రజలకు సేవలందించే ఒకేఒక విభాగం పోలీసు మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.