తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలీసు సిబ్బంది నుంచి సీఎం గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరులు గురించి ఆయన మాట్లాడుతు వారి త్యాగాల గురించి వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి రాష్ట్రంప్రభుత్వం కృషిచేస్తోందని, పోలీసు అమరవీరులు రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం కొనియాడుతున్నారు.