గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిజిపి సివి ఆనంద్ మాట్లాడుతూ.. గతంలో ప్రతి ఏడాది అమరులైన పోలీసుల జాబితా పెద్దగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య తగ్గిందని తెలిపారు. కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ప్రస్తుతం స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని, నక్సలిజం సమస్య తగ్గుముఖం పట్టడంతో పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో మారిపోయాయని తెలంగాణ డిజిపి సివి ఆనంద్ తెలిపారు