దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల డేటా లీక్ వార్తలు కలకలం రేపుతున్నాయి. డార్క్ వెబ్‌లో బ్యాంకు ఖాతాదారుల డేటా బయటపడినట్లు డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3,75,000 రికార్డులను పరిశీలించగా, వాటిలో 3,897 ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో కూడిన రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎస్బీఐ అధికారికంగా స్పందించింది. ఇవాళ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సమర్పించిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.