దసరా పండుగ ముగిసింది. సొంత ఊళ్లకు వెళ్లిన జనాలు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. సాయంత్రం హైదరాబాద్ వచ్చే రూట్లు చీమల బారుల్లాగ వాహనాల రద్దీతో నిండిపోయాయి. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోయాయి. నార్కట్ పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి పంతంగి టోల్ ప్లాజా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు 9 టోల్ బూత్లు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు.