బాలివుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్కు చెందిన జుహూ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) చర్యలు తీసుకుంది. ఆయన ఇంటిలో పలు నిర్మాణాలను ఈరోజు (శనివారం) కూల్చివేసింది. అజయ్ దేవ్గణ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ మార్పులను చేపట్టినట్లు బీఎమ్సీ పేర్కొంది. ఇంటీరియర్ మార్పులు, పార్టిషన్ గోడల నిర్మాణం, కిటికీల మోడిఫికేషన్ పనులు అనుమతులు లేకుండా చేస్తున్నట్టు తాము గుర్తించామని, అందుకే ఆయా నిర్మాణాలను ధ్వంసం చేశామని వెల్లడించింది.