దిల్లీలోని కన్నాట్ ప్లేస్లో జరిగిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ప్రదర్శనకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను, అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో నేహా బోరాను శనివారం తెల్లవారుజామున విడుదల చేయగా, దీప్కేను మాత్రం శనివారం సాయంత్రం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లో హాజరుపరచనున్నారు. శాంతిభద్రతలకు భంగం జరిగిందనే ఆరోపణలతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.