శ్రీకాకుళంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం మేయర్ పదవి ఆమెకు కేటాయించే అవకాశం ఉందని.. అందుకే ఆమె వైఎస్సార్సీపీలోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గుండ లక్ష్మీదేవి కూటమి తరఫున మేయర్ సీటు ఆశించారు. కానీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా శ్రీకాకుళం మేయర్ జనసేన పార్టీకి కేటాయించారు.