ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడిచమురు ధర మే నెల తర్వాత తొలిసారిగా బ్యారెల్కు 110 డాలర్ల మార్కును తాకింది. ఇటీవలే రష్యాలోని రియాజాన్ ఆయిల్ రిఫైనరీపై జరిగిన దాడితో అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాదిలోనే ముడిచమురు ధరలు ఏకంగా 70 శాతానికి పైగా పెరిగాయి. యూరప్లో డీజిల్ ధరలైతే ఏకంగా రెట్టింపు స్థాయికి చేరడం కలకలం రేపుతోంది.