దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక శైలితో కోట్లాది మంది సంగీత అభిమానులను అలరించిన దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు దేవనేశన్ చొక్కలింగం (75) తుదిశ్వాస విడిచారు సుమారు 30 సంవత్సరాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 400లకు పైగా చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రానికి ఆయన అందించిన బాణీలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయనకు సంగీత ప్రపంచంలో విశేష గుర్తింపును తెచ్చిపెట్టాయి.